విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్‌లో విద్యార్థి వాలంటీర్లకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సీఐ నిత్యబాబు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలను వివరించారు.