అధికారుల తీరుపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం

అధికారుల తీరుపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం

AP: అధికారుల తీరుపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టిడ్కో పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని స్టేజ్‌పైనే మైక్‌లో సీరియస్ అయ్యారు. మంత్రి తర్వాత ఎమ్మెల్యేను పిలవాల్సి ఉండగా, నేరుగా జాయింట్ కలెక్టర్‌ని స్టేజ్‌పైకి పిలవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు ప్రొటోకాల్ తెలియదా?' అంటూ అధికారులను ప్రశ్నించారు.