కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా

కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా

కోనసీమ: అమలాపురం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి వస్తున్న మురికి నీరు కారణంగా తమ పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని సోమవారం కలెక్టరేట్ వద్ద కామనగరువు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ముంపు నీరు వలన 40 ఎకరాలలో నారుమళ్లు వేయలేకపోయామని రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి శివన్నారాయణ, బొంతు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.