విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులు
మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి తండాకు చెందిన రాజేశ్వరికి మెదక్ జిల్లా పటాన్ చేరులోని మహేశ్వర మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటాలో మెడిసిన్ సీటు వచ్చింది. రాజేశ్వరిది నిరుపేద కుటుంబం కావడంతో దాతల సహాయం కోరింది. విషయం తెలుసుకున్న ఆమె స్నేహితులు తమకు తోచిన మేర పోగుచేసి రూ.75 వేలు ఆర్థిక సహాయాన్ని బుధవారం విద్యార్థినికి అందజేశారు.