ఎన్నికల అవగాహన సదస్సుకు హాజరుకాని సర్పంచ్ అభ్యర్థులు
KNR: వీణవంక మండల కేంద్రంలో సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీడీవో, ఎస్సై పలు సూచనలు చేశారు. అభ్యర్థులు గిఫ్ట్, ఓటర్లను ఆకర్షించే వస్తువులను ఇచ్చిన ఇతరులను కించపరిచే విధంగా పోస్ట్ పెట్టినా, మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు . ఒక్క సర్పంచ్ అభ్యర్థి కూడా హాజరు కాకపోవడం విడ్డూరమని అధికారులన్నారు.