ఎంఈవోకు వినతిపత్రం అందజేత

KRN: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మండల విద్యాధికారి శ్రీనివాస్‌కు ఏబీవీపీ నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, చొప్పదండి నగర కార్యదర్శి భీమనాతిని వరుణ్, తదితరులు పాల్గొన్నారు.