తిరుపతిలో మహిళ అనుమానాస్పద మృతి
TPT: తిరుపతిలో మహిళ అనుమానాస్పద మృతి తిరుపతి టౌన్ గిరిధర్ దాస్ లైన్‌లో 26 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు మర్రిబోయిన చైతన్యగా గుర్తించారు. ఆమె ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందినదిగా పోలీసులు తెలిపారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.