జిల్లాలో పెరిగిన ఎండల తీవ్రత

జిల్లాలో పెరిగిన ఎండల తీవ్రత

NZB: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఉదయం నుంచే వేడి, ఉక్కపోత ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నానికి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సాధరణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం గుడిపల్లి మండలంలో ఏకంగా 41.6 డిగ్రీలు నమోదవడం గమనార్హం. కాగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించారు.