VIDEO: మద్యం మత్తులో కరెంటు పోల్‌ను ఢీ కొట్టిన కారు
WNP: వనపర్తి పట్టణంలో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో అతివేగంగా ప్రయాణించి వీరంగం సృష్టించాడు. పట్టణంలోని వివేకానంద చౌరస్తావద్ద డివైడర్‌లో ఏర్పాటు చేసిన కరెంటు పోల్‌ను కారుతో ఢీకొట్టాడు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.