'ధాన్యం ఆరబెట్టిన తర్వాతే కేంద్రాలకు తరలించాలి'
MDK: రామాయంపేటలోని రైతులు యాసంగి వరి కోతల నేపథ్యంలో ధాన్యాన్ని పొలాల్లో ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని ఏఈఓ సాయికృష్ణ సూచించారు. హార్వెస్టర్లతో కోసే సమయంలో ఆర్పీఎం ఫ్యాన్‌ను సరిగ్గా సెట్ చేసుకోవాలని, తద్వారా ధాన్యం శుభ్రంగా వస్తుందని తెలిపారు. తేమ శాతం నిబంధనల ప్రకారం ఉంటేనే మద్దతు ధర లభిస్తుందని, రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి సహకరించాలని కోరారు.