'మున్సిపల్ మస్టర్ పాయింట్ తనిఖీ'

'మున్సిపల్ మస్టర్ పాయింట్ తనిఖీ'

సత్యసాయి: ధర్మవరం మున్సిపల్ ఇన్‌ఛార్జ్ కమిషనర్ సాయి కృష్ణ శనివారం ఉదయం గాంధీనగర్‌లోని మున్సిపల్ మస్టర్ పాయింట్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. ఫిట్టర్స్, వాటర్ సప్లై సిబ్బంది, స్ట్రీట్ లైటింగ్ సిబ్బందికి విధులపై సూచనలు చేశారు. వార్డు ప్రజలకు సకాలంలో మంచినీరు అందించాలన్నారు. పైప్‌లైన్ లీకేజీలు, స్ట్రీట్ లైట్స్ లోపాలను గుర్తించి వెంటనే సరిచేయాలని ఆదేశించారు.