వైభవంగా వీరభద్ర స్వామి జయంతి
CTR: పుంగనూరులో వీరభద్ర స్వామి వారి జయంతి వైభవంగా మంగళవారం నిర్వహించారు. ఈ మేరకు పట్టణంలోని స్థానిక నగిరిలో కొలువైన అఘోర వీరభద్ర స్వామి వారి ఆలయంలో అర్చకులు రుద్రాభిషేకాలు నిర్వహించి వెండి ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.