శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా జిల్లా వాసి
NGKL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన BJP రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డి నియమింపబడ్డారు. ఈ సందర్భంగా చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి శ్రీశైలం దేవస్థానం బోర్డులో సభ్యత్వం ఇవ్వడం విషేశంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.