VIDEO: ఆగని మొరం దందా.. ఇందిరమ్మ ఇళ్ల పేర్లతో పక్కదారి
KMR: బీర్కూర్ మండలం మల్లాపూర్ అటవీ ప్రాంతాల్లో యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేర్లతో పక్కదారి పట్టిస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ జేసీబీ, టిప్పర్ల ద్వారా మొరం తవ్వకాలను కొనసాగిస్తున్నారు. అటవీ ప్రాంతం పైభాగంలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉండటంతో తవ్వకాల వల్ల ముప్పు వాటిల్లుతుందని స్థానికులు వాపోతున్నారు.