VIDEO: ఆర్టీసీ బస్సుల్లో UPI చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్..!

WGL: ఆర్టీసీ బస్సు ఎక్కేముందు సరిపడ చిల్లర కోసం ఇకపై జేబులు తడుముకోవాల్సిన పనిలేదు. కొంతకాలంగా యూపీఐల వినియోగంతో చిల్లర కోసం కష్టాలు ఎదుర్కొంటున్న జనానికి ఆర్టీసీ కండక్టర్ల వద్ద యూపీఐ స్కానర్లు పెట్టే వెసులుబాటు కల్పించింది. శనివారం వర్ధన్నపేట ఆర్టీసీ బస్టాండ్‌లో కండక్టర్ వద్ద ఉన్న టీంమిషన్‌లో ఓ ప్రయాణికుడు తన ఫోన్‌తో స్కాన్ చేసి టికెట్ తీసుకున్నాడు.