'ప్రతి మహిళా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి'

అన్నమయ్య: పీలేరులో ప్రతి మహిళా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎస్సై బాలకృష్ణ కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా ఏదైనా సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందుతుందని పేర్కొన్నారు. మహిళలు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుని పోలీస్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.