కడుపునొప్పి తాళలేక వ్యక్తి మృతి

కడుపునొప్పి తాళలేక వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా కోసిగిలో కడుపునొప్పి తీవ్రతను తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. బసవన్నకట్ట కాలనీకి చెందిన హనుమంతు అనే వ్యక్తి కేబుల్ టీవీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న అతనికి, నొప్పి తీవ్రం కావడంతో ఇంట్లోకి వెళ్లి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.