ధర్మవరంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

ధర్మవరంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

సత్యసాయి: ధర్మవరం పట్టణ పరిసరాల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాల్తూరి రామకృష్ణ, ఈశ్వరా చారి అనే ఇద్దరు దొంగలు పగటిపూట రెక్కీ చేసి రాత్రిపూట మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కోవడం, తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని వివరించారు.