వరి కొనుగోళ్ళు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
MBNR: హన్వాడ మండలంలోని వేపూరు మునిమోక్షం గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి కొనుగోళ్ళు కేంద్రాలను సోమవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చి, వారి ఆర్థిక భరోసాను మరింత బలోపేతం చేసిందని ఎమ్మెల్యే అన్నారు.