'ఈనెల 12న ఉల్లాస్ పై మండల స్థాయి శిక్షణ'

'ఈనెల 12న ఉల్లాస్ పై మండల స్థాయి శిక్షణ'

SRD: జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 12వ తేదీన ఉల్లాస్ కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడు, విలేజ్ అసిస్టెంట్ హాజరుకావాలని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యతగా తీర్చిదిద్దేందుకే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.