'రాహుల్ ఉన్నంతకాలం కాంగ్రెస్ గెలవదు'
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. బీహార్ పోలింగ్ ముందు హర్యానా కథ వినిపిస్తున్నారని అన్నారు. రాహుల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ ఉన్నంతకాలం కాంగ్రెస్ గెలవదని ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈసీకి చెప్పాలని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకే SIR ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు.