'ఇన్ సర్వీస్ కోటాపై పునరాలోచన చేయండి'

E.G: ప్రభుత్వ వైద్యుల పీజీ ప్రవేశాలలో ఇన్ సర్వీస్ కోటాను తగ్గిస్తూ విడుదల చేసిన జీఓ ఎమ్మెస్ నెంబర్ 85 గురించి ప్రభుత్వం పునరాలోచన చేయాలని అనపర్తి నియోజకవర్గ పీహెచ్సీ వైద్యాధికారులు కోరారు. ఈ మేరకు అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇన్ సర్వీస్ కోటాను మునుపటిలా కొనసాగించాలని వారు ఎమ్మెల్యేని కోరారు.