పెద్ద హరివాణంలో ఎమ్మెల్యేకు ఘన సన్మానం

పెద్ద హరివాణంలో ఎమ్మెల్యేకు  ఘన సన్మానం

KRNL: జిల్లాలోని పెద్ద హరివాణం గ్రామాన్ని కొత్త మండలంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామస్థులు ఆనందంతో ఎమ్మెల్యే పార్థసారథితో పాటు కురువ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ దేవేంద్రప్ప, టీడీపీ రాష్ట్ర నాయకురాలు గుడిసె కృష్ణమ్మను శుక్రవారం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు.