కొత్తపల్లిలో నేడు కార్యకర్తల సమావేశం
NDL: కొత్తపల్లి మండల కేంద్రంలో నేడు కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఉదయం 10.00 గంటలకు హాజరవుతారని, పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నందు జరిగే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో 11.00 గంటలకు పాల్గొంటారని, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.