ఎర్ర కాలువ ప్రాజెక్ట్ అప్డేట్

ఎర్ర కాలువ ప్రాజెక్ట్ అప్డేట్

ELR: జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్ర కాలువకు మంగళవారం స్వల్పంగా వరద ప్రవాహం తగ్గింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 83:50 కాగా ప్రస్తుతం 82:40 కి వరద నీరు చేరుకుంది. ఇన్ ఫ్లో 578 క్యూసెక్కులకి పడిపోవడంతో 1500 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుండి నీటి ప్రవాహం ఇన్ ఫ్లో పెరిగితే ఔట్ ఫ్లో పెరుగుతుందన్నారు.