హాలియాలో నేడు 2K రన్, ఉచిత వైద్య శిబిరం

హాలియాలో నేడు 2K రన్, ఉచిత వైద్య శిబిరం

NLG: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం 7:30 గంటలకు హాలియా పురపాలక సంఘం ఆధ్వర్యంలో '2K రన్' నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్ సౌజన్యంతో సాగర్ రోడ్డు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ పరుగు కొనసాగనుంది. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు.