VIDEO: నడుస్తున్న ఆటోలో అకస్మాత్తుగా మంటలు

VIDEO: నడుస్తున్న ఆటోలో అకస్మాత్తుగా మంటలు

NRML: కుబీర్ మండలం మాలేగాం గ్రామ సమీపంలో బుధవారం ఓ ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. రోడ్డుపై ఆటో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే వాహనాన్ని ఆపి కిందకు దూకేశాడు. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఆటో మొత్తానికి వ్యాపించాయి.