అధిక వడ్డీల బెదిరింపులు.. ఐదుగురు అరెస్ట్

GNTR: తాడేపల్లిలో ఓ వివాహితను అధిక వడ్డీలు చెల్లించమని బెదిరించి, వేధింపులకు పాల్పడిన ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మంగళవారం తాడేపల్లి CI వీరేంద్ర తెలిపారు. నిందితుల నుంచి వివాహిత భర్త రూ.50 వేలు తీసుకోగా వడ్డీతో సహా చెల్లించినప్పటికీ బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడారని చెప్పారు.