ఏనుగు సంచారం ఘటనపై డిప్యూటీ సీఎం సమీక్ష

CTR: పలమనేరు పరిసరాల్లో ఏనుగు సంచారం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో శనివారం రాత్రి సమీక్షించారు. ఏనుగు దాడిలో గాయపడిన అటవీ సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఏనుగుల కదలికలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే కుంకీ ఏనుగులతో గస్తీ ఏర్పాటు చేయాలని తెలిపారు. పవన్ ఆదేశాలతో శనివారం రాత్రి కుంకీ ఏనుగులు రంగంలోకి దింపారు.