'డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లులను చెల్లించాలి'
SRCL: గత ప్రభుత్వ హయాంలో నిర్మించుకున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు డబ్బులు చెల్లించాలంటూ జిల్లా కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులు సోమవారం ధర్నా చేపట్టారు. బోయిన్ పల్లి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం తరలివచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల బిల్లులు చెల్లించాలని ఆందోళన చేశారు.