ఆటలోనే ముగిసిన చిన్నారి జీవితం
KRNL: ఆదోని పట్టణంలో ఊయలతో ఆడుకుంటూ పదేళ్ల బాలుడు అకీరానందన్ మృతి చెందాడు. ఇంట్లో చీరతో కట్టిన ఊయలతో ఆడుకుంటుండగా చీర మెడకు చుట్టుకుని వేలాడటంతో ఊపిరాడక బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యుల చికిత్స ఫలించక ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.