VIDEO: సోమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

JN: జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.