VIDEO: శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి శోభ
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామునే హరిహరుల దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చి క్యూలైన్లలో వేచి ఉన్నారు. సోమేశ్వరుడికి పంచామృత్రాలతో అభిషేకాలు నిర్వహించగా, భక్తులు స్వామివారి ఆశీర్వాదాలు పొందుతూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.