VIDEO: శ్రీ శంకర్ లింగేశ్వర జాతర ప్రారంభం
NRPT: ఊట్కూరు మండలం సమిస్తాపూర్ శివారులో కర్ణాటక సరిహద్దులోని పెద్దవాగు ఒడ్డున ఉన్న శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకుడు కొల్లూరు శంకరయ్య మాట్లాడుతూ.. రేపు రథోత్సవం వైభవంగా జరుగుతుందని తెలిపారు. 15 రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని చెప్పారు.