'పార్వతీపురంలో చెరువులను రక్షించండి'
PPM: గత ప్రభుత్వం హయాంలో అన్యాక్రాంతమైన చెరువులను పరిరక్షించాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం డిప్యూటీ స్పీకర్ రామకృష్ణ రాజు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్వతీపురంలోని స్థానికులు ఫిర్యాదు మేరకు తాను అధికారులు కలిసి అక్కడ పరిశీలించగా భారీ ఎత్తున ఆక్రమణలను గుర్తించినట్లు సభకు వివరించారు.