సమగ్రత కోసం పోరాడిన ఉక్కు మనిషి పటేల్: ఎస్పీ

సమగ్రత కోసం పోరాడిన ఉక్కు మనిషి పటేల్: ఎస్పీ

GDWL: దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేష కృషి చేశాడని శుక్రవారం గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలన అనంతరం స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారత భూభాగాన్ని ఏకం చేసి దేశ రక్షణ, సమగ్రత కోసం పాటుపడ్డారన్నారు.