ఘనంగా చాగోల్లు కోదండరామస్వామి ఉత్సవాలు

NLR: ఉలవపాడు మండలం చాగోల్లు గ్రామంలో శుక్రవారం కోదండరామస్వామి ఉత్సవాలు జరిగాయి. నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి, సీతారాములను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు హాజరయ్యారు.