VIDEO: ఏడుపాయలలో వనదుర్గమ్మ పునఃదర్శనం
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో వనదుర్గా మాత ప్రధాన ఆలయం సోమవారం తెరుచుకుంది. ఆలయాన్ని సంప్రోక్షణ చేసి ఈ తెల్లవారుజామున ఆలయ అర్చకులు కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు దుర్గమ్మ పునఃదర్శనం కల్పిస్తున్నారు.