టీడీపీ తీర్థం పుచ్చుకున్న పాకాల వైస్ ఎంపీపీ

చిత్తూరు: పాకాల మండలంలో ఎమ్మెల్యే పులవర్తి నాని బుధవారం పర్యటించారు. పార్టీ శ్రేణులు పాకాల నుంచి బైనపల్లి వరకు కర్పూర హారతులు, గజమాలలతో నానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ చెన్నకేశవరెడ్డితో పాటు ఆయన అనుచరులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.