యుద్ధం వేళ ఎయిరిండియా కీలక నిర్ణయం
ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఇవాళ పశ్చిమాసియాకు మొత్తం 48 విమానాలను నడపనున్నాయి. జెడ్డాకు 16, మస్కట్‌కు 6, రియాద్‌కు 2 షెడ్యూల్డ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. HYD, ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి ఈ విమానాలు నడుస్తాయి. వీటితో పాటు UAE, సౌదీలకు మరో 30 నాన్-షెడ్యూల్డ్ విమానాలను కూడా నడపనున్నారు. దీని కోసం అవసరమైన అన్ని అనుమతులు పొందినట్లు సంస్థ తెలిపింది.