కోర్డినేటర్-2 నియామకంపై టీపీటీఎఫ్ ఆగ్రహం
MLG: జిల్లా విద్యాశాఖలో నిబంధనలకు విరుద్ధంగా AMO (కోర్డినేటర్-2) నియామకం చేపట్టడాన్ని తక్షణం రద్దు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లలో సీనియారిటీ ఆధారంగా అవకాశం ఇవ్వకుండా ఈ నియామకం చేపట్టడం సరికాదని అన్నారు.