ఒంటిమిట్టలో భారీ వర్షం
KDP: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గురువారం ఒంటిమిట్ట మండలంలోని పలు ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. వర్షం కురవడంతో వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. రహదారిపైకి నీళ్లు రావడంతో బైకులు, ఆటోల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ వర్షం రాకతో పంటలకు మేలు చేరుతుందని అన్నదాతలు అంటున్నారు.