ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్‌ను విడుదల చేయాలి
AKP: ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్‌ను తక్షణమే విడుదల చేసి నిరుద్యోగ దళిత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు డిమాండ్ చేశారు. నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో మాట్లాడుతూ.. ప్రతి ఏటా రావాల్సిన నిధులు ఆలస్యమవడంతో ఎస్సీ యువత నష్టపోతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలన్నారు.