ఎన్నికల పోటీలో 44 మంది అభ్యర్థులు
AP: రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో 44 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 48 నామినేషన్లు దాఖలు కాగా రెండు తిరస్కరణకు గురయ్యాయి. ఈ ఎన్నికల్లో 60,943 మంది ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్లకు డిసెంబరు 4 నుంచి 8 లోపు బ్యాలెట్ పత్రాలను పంపిస్తారు. ఓటు వేసి డిసెంబరు 11 నుంచి 24న సాయంత్రం 5 గంటల లోపు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ కార్యాలయానికి చేరేలా పంపాలి.