తిరుపతిలో వైసీపీ నాయకుడి కారు ధ్వంసం
TPT: వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైతన్య కారును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తిరుపతి ఆకారంపల్లి రాధాశ్యామ్ అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసి ఉన్న కారు ధ్వంసమైంది. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాధితుడు అలిపిరి పోలీసులను సంప్రదించాడు. తనకు రక్షణ కల్పించాలని గతంలో కూడా తనపై దాడి జరిగిందని చెప్పారు.