డ్రోన్ కెమెరాలతో అక్రమాలపై పోలీసుల నిఘా పెంపు
కృష్ణా: పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వణుకూరు, వైకుంటపురం ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. సోమవారం కోడిపందాలు, పేకాట వంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి, డ్రోన్ కెమెరాల సాయంతో గగనతలం నుంచి పర్యవేక్షించారు. ప్రజలు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.