అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వాయిదా

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వాయిదా

సత్యసాయి: పెనుకొండలోని జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 8న నిర్వహించాల్సిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. శనివారం పెనుకొండలో కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. పెనుకొండ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీ జరగాల్సిన వేడుకలు ఈనెల 9న సోమవారం సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.