రేపు ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు సీఎం

కృష్ణా: సీఎం చంద్రబాబు రేపు (ఆదివారం) కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జరిగే ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఉగాది సంబరాలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.