డీకేడబ్ల్యూ కళాశాలలో రేపటి నుంచి స్పాట్ అడ్మిషన్లు

డీకేడబ్ల్యూ కళాశాలలో రేపటి నుంచి స్పాట్ అడ్మిషన్లు

నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో సోమవారం నుంచి ఎంఏ తెలుగు, ఎమ్ఎస్‌సీ జూవాలజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ గిరి ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ సెట్ లేకపోయినా స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఈ కోటాలో చేరేవారికి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదని ఆయన వెల్లడించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.