ఘనంగా డీజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

PDPL: డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంథని మంత్రపురి ప్రెస్ క్లబ్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆక్రిడిటేషన్లతో సంబంధం లేకుండా పత్రిక సంస్థలు ఇచ్చే గుర్తింపు కార్డు ప్రాతిపదికన జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడిపెళ్లి అజయ్, కంది కృష్ణారెడ్డి, సురేశ్, మంథని లక్ష్మణ్ పాల్గొన్నారు.